మిమిక్రీ కళారంగంలో
యం.ఆర్. ప్రసాదు ఓ హిమాలయ పర్వతం
యం.ఆర్. ప్రసాద్ మిమిక్రీ ప్రోగ్రాం అంటే అక్కడ జనసముద్రం. క్రియేటివిటీ అనుకరణలో పర్ఫెక్షన్ యం.ఆర్. ప్రసాద్ కు దైవం ఇచ్చిన వరం. అతని గంభీర, బేస్ వాయిస్ గాడ్ గిఫ్ట్.
5,000 ప్రోగ్రాంలు, 120 రకాల ఆడియో క్యాసెట్స్, యమ్. ధర్మరాజు యమ్.ఎ. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఇచ్చింది యం.ఆర్. ప్రసాద్. దానికి ప్రజలలో మంచి స్పందన వచ్చింది. అనేకమంది శిష్యులు – అభిమానులు. మీరెప్పుడైనా యం.ఆర్. ప్రసాద్ మిమిక్రీ ప్రోగ్రామ్స్ చూశారా – లేక ప్రోగ్రామ్ పెట్టించారా! శ్రీదేవి పెళ్ళి మిమిక్రీ క్యాసెట్ విన్నారా!
1995లో మిమిక్రీ కళారంగంలో నెంబర్ – 1ప్లేస్ లో ఉన్న యం.ఆర్. ప్రసాద్ కళాకారుడిగా రిటైర్మెంట్ ప్రకటించారు. ఆ తరువాత ఆయన గొంతు వినపడలేదు. మొట్టమొదటిసారిగా మిమిక్రీ ట్రయినింగ్ స్కూలు స్థాపించి, మిమిక్రీ కళారంగానికి ఎనలేని సేవలు చేసిన కళాకారుడు – మిమిక్రీ క్యాసెట్ కింగ్ యం.ఆర్. ప్రసాద్.